రైల్వే పట్టాల మధ్యలో 2నెలల పసికందు
NEWS Jan 07,2025 06:08 am
పెద్దపల్లి జిల్లాలో నీ కునరం గెట్ వద్ద ఉదయం 6 గంటలకు రెండు నెలల వయస్సు గల సజీవ మగబిడ్డ లభించింది. సమాచారం అందుకున్న రామగుండం సీఐ బి.సురేష్ గౌడ్, ఎస్సై బి.క్రాంతి కుమార్, సుమన్, కానిస్టేబుల్ నెం. 336తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సజీవంగా ఉన్న మగబిడ్డకు వెంటనే భద్రత కల్పించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.