పీఎం సూర్య ఘర్ పథకానికి కుప్పం కేరాఫ్
NEWS Jan 07,2025 03:37 am
సూర్యఘర్ పథకానికి సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కేరాఫ్ గా నిలబోతోందని స్పష్టం చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. పూర్తి స్థాయి సోలరైజేషన్ కు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. కుప్పంలో 53, 314 మంది విద్యుత్ వినియోగదారుల కనెక్షన్లు త్వరలోనే సౌర విద్యుత్ తో అనుసంధానం అవుతాయన్నారు. 2,66,15,521 చదరపు అడుగుల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు రంగం సిద్దం చేశామన్నారు .