గేమ్ ఛేంజర్ ఈవెంట్ సందర్బంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మృతి చెందడం పట్ల నటుడు రామ్ చరణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా కాకినాడ జిల్లాకు చెందిన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ బైకు మీద వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు నిర్మాత దిల్ రాజు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.