జగన్ కుంభకోణాలపై దర్యాప్తు
NEWS Jan 06,2025 02:13 pm
గత జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అనేక కుంభకోణాలు చోటు చేసుకున్నాయని అన్నారు మంత్రి నారా లోకేష్. వాటన్నింటిపై విచారణకు ఆదేశించామన్నారు. లా అండ్ ఆర్డర్ ను చూసే పోలీసులందరూ వీటిపైనే పని చేయాల్సి ఉంటుందన్నారు. లెక్కలేనన్ని స్కాములు జరిగాయని వాపోయారు. ప్రస్తుతం మద్యం, ఇసుక కుంభకోణాలపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. త్వరలోనే అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్నారు.