ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభం
NEWS Jan 06,2025 05:52 am
హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆరాంఘర్ జూ పార్క్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరాంఘర్ చౌరస్తా నుంచి జూపార్కు వరకు 6 లైన్ల ఫ్లై ఓవర్ ను నిర్మించారు. దీని కోసం రూ. 799 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం 4.8 కిలోమీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పుతో దీనిని నిర్మించారు. ఇది ప్రారంభం కావడంతో వాహనాల రాక పోకలకు ఇబ్బందులు ఉండవు.