భారత్‌లో హెచ్‌ఎంపీవీ వైరస్ తొలి కేసు
NEWS Jan 06,2025 05:47 am
చైనాను వణికిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత దేశంలోకి ప్రవేశించింది. తొలి కేసు బెంగళూరులో నమోదైంది. ఎనిమిది నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మాస్క్ లు ధరించాలని, శానిటైజర్లు వాడాలని సూచించింది.