ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లి పోయారు మాజీ మంత్రి కేటీఆర్. లాయర్లను లోపలకు అనుమతించక పోవడంతో వెనుదిరిగారు. 40 నిమిషాల పాటు పోలీసులు, కేటీఆర్ టీమ్ మధ్య వాగ్వాదం జరిగింది. లాయర్లను అనుమతించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వలేదన్నారు. ఈ నిబంధన తనకు చూపించాలని పట్టుపట్టారు కేటీఆర్. ఖాకీల తీరును నిరసిస్తూ విచారణకు హాజరు కాకుండానే వెళ్లి పోయారు.