శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.98 కోట్లు
NEWS Jan 06,2025 05:17 am
తిరుమల శ్రీవారిని 66 వేల 561 మంది భక్తులు దర్శించుకున్నారు. 18 వేల 647 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.98 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం దర్శనం కోసం డైరెక్టు లైన్ కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 9 గంటలకు పైగా పడుతుందన్నారు.