నిజామాబాద్ టు హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
NEWS Jan 05,2025 01:02 pm
నిజామాబాద్ డిపో నుంచి వయా వర్ని, బాన్సువాడ, ఎల్లారెడ్డి, మెదక్, నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ వరకు ఎలక్ట్రిక్ బస్సులను నిజామాబాద్ డిపో మేనేజర్ మోహన్ రావు ప్రారంభించారు. అధునాతనమైన ఎలక్ట్రిక్ ఎక్స్ ప్రెస్ బస్సులను ప్రారంభించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రికల్ ఎక్స్ ప్రెస్ బస్సులలో మహిళలు ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు.