ప్రాణదాత కటుకం గణేష్ కు సన్మానం
NEWS Jan 05,2025 02:13 pm
కోరుట్ల పట్టణానికి చెందిన సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ కు ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు పొందిన సందర్భంగా అవార్డు గ్రహీత గణేష్ కు కోరుట్లకు చెందిన అడ్లగట్ల గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కోరుట్ల ప్రాంతంలో ఒకప్పుడు రక్తం దొరకగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని, ఇప్పుడు 17 సంవత్సరాల నుండి కటుకం గణేష్ కోరుట్లలోనే కాకుండా పలు ప్రాంతాలలో రక్తదానానికి కొదవ లేకుండా చూస్తున్న వ్యక్తి అని అన్నారు.