చందుర్తి: అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేసి సస్పెన్షన్‌లో ఉన్న తహశీల్దార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు చందుర్తి సీఐ జి. వెంకటేశ్వర్లు తెలిపారు. చందుర్తి మండలం మల్యాలకు చెందిన సంటి లస్మవ్వ భూమి 38 గుంటలను అదే గ్రామానికి చెందిన గొంటి రాజనర్సుకు అప్పటి తహశీల్దార్ నరేశ్ అక్రమంగా పట్టా చేశాడన్నారు. తాహశీల్దార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.