తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS Jan 05,2025 04:27 am
తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారిని 71 వేల 990 మంది భక్తులు దర్శించుకున్నారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.26 కోట్లు వచ్చినట్లు ఈవో శ్యామల రావు వెల్లడించారు. క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండకుండా నేరుగా శ్రీవారి దర్శనం కలుగుతోందని తెలిపారు. స్థానికులకు దర్శన టోకెన్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.