ప్రతి సోమవారం హైడ్రా ప్రజావాణి
NEWS Jan 05,2025 03:47 am
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ లో ఆక్రమణదారులు , బాధితులు ఎక్కువై పోయారని అన్నారు. ఇప్పటికే సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నగరమంతా సర్వే చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా 1305 చెరువులను గుర్తించడం జరిగిందన్నారు. ఫిర్యాదులు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు గాను ప్రత్యేకంగా ప్రతీ సోమవారం ప్రజావాణి నిర్వహించనున్నట్లు వెల్లడించారు కమిషనర్.