ప్రభుత్వ బడులు..కాలేజీల్లో చదవాలి
NEWS Jan 05,2025 03:34 am
హోం మంత్రి అనిత వంగలపూడి విద్యారంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి విద్యార్థులు, పేరెంట్స్ కు ప్రభుత్వ బడులు, కాలేజీలంటే చిన్న చూపు ఉందన్నారు. దానిని పక్కన పెట్టాలన, కష్టపడి చదువుకుంటే ఎంతటి స్థానానికైనా వెళ్ల వచ్చని చెప్పారు. తనను తన తండ్రి కష్టపడి చదివించాడని, తాను కూడా ప్రభుత్వ బడిలోనే చదువుకున్నానని అన్నారు. విద్య ఆభరణమని, దానితోనే వికాసం అలవడుతుందన్నారు.