కొనసాగుతున్న ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఆందోళన
NEWS Jan 05,2025 03:26 am
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. 26వ రోజు సమ్మె శిబిరాన్ని రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఆయన దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లారు.