మధ్యాహ్న భోజన పథకం వరం
NEWS Jan 04,2025 02:24 pm
మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు వరంగా మారిందన్నారు మంత్రి వంగలపూడి అనిత. సబ్బవరం జూనియర్ కాలేజీలో ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. జీవితంలో అత్యంత విలువైనది చదువు మాత్రమేనని అన్నారు. కష్టపడి చదువుకుని పైకి రావాలని సూచించారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, కలెక్టర్ విజయ కృష్ణన్, టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ గండి బాబ్జి పాల్గొన్నారు.