విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 20 వేల కోట్లు ఇవ్వాలి
NEWS Jan 04,2025 12:03 pm
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పీఎం మోడీపై నిప్పలు చెరిగారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందన్నారు. ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. తక్షణమే రూ. 20 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని, అప్పుడే నరేంద్ర మోడీ విశాఖలో కాలు మోపాలని హెచ్చరించారు. మూడేళ్ల పాటు స్టీల్ ప్లాంట్ కి ట్యాక్స్ హాలీడే ప్రకటించాలని డిమాండ్ చేశారు.