ఎమ్మెల్యే క్వార్టర్స్ ను ఖాళీ చేయండి
NEWS Jan 04,2025 11:36 am
తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ లోని ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉంటున్న వారంతా ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ కేటాయిస్తామన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లతో పాటు పలు దుకాణాలకు సైతం నోటీసులు జారీ చేశారు.