అటవీ సమీప గ్రామాల్లో చిరుతల సంచారం
NEWS Jan 04,2025 05:45 am
దట్టమైన అడవుల్లో సంచరించే చిరుత పులులు అటవీ సమీప గ్రామాల్లోకి వస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొద్ది రోజులుగా చిరుతలు సంచరిస్తుండడంతో ప్రజలు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు.నందిపేట్ మండలం బజార్ కొత్తూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోని మాయాపూర్, సీహెచ్ కొండూరు గ్రామాల శివారులోని అటవీ ప్రాంతంలో ఓ చిరుత పులి మేకల మందపై దాడి చేసింది.గాంధారి మండలం మడుగుతండా పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం వెలుగులోకి వచ్చింది. ఓ చిరుత పులి మేకల మందపై దాడి చేసి మేకను గాయపరిచింది.