జేసీ ప్రభాకర్ రెడ్డిపై మంత్రి ఫైర్
NEWS Jan 03,2025 01:36 pm
మంత్రి సత్య కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదన్నారు. ఎక్కడో ఏదో బస్సు కాలిపోతే దానిని బీజేపీ వాళ్లకు ఎలా అంటగడతారంటూ ప్రశ్నించారు. గతంలో ఆయన వ్యాపారాలపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని, తాము వాటి జోలికి వెళ్ల బోమన్నారు. దేశాన్ని పాలిస్తున్న తమ పార్టీపై నోరు పారేసుకోవడం మంచిది కాదన్నారు.