మహనీయురాలు సావిత్రిబాయి పూలే
NEWS Jan 03,2025 06:12 am
సామాజిక సంస్కర్త, ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. చదువు విలువ గుర్తించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అన్ని వర్గాలకు చదువు దక్కాలని అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. ఆమెను స్మరించు కోవడం అంటే విద్య విలువను గుర్తించడమేనని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా జయంతి జరపాలని ఆదేశించామన్నారు సీఎం.