ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం, విజయవాడ నగరాలలో మెట్రో ప్రాజెక్టును అమలు చేయాలని సంకల్పించారు. డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ట్రైన్ అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. రెండు నగరాలలో 25 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు సీఎం.