మాజీ మంత్రి కడియం శ్రీహరి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబం మొత్తం అవినీతికి కేరాఫ్ అంటూ ఎద్దేవా చేశారు. 10 ఏళ్లపాటు తెలంగాణ వనరులను కొల్లగొట్టారని, తాము నిజాయితీ పరులమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లి వచ్చిందని, రేపు కేటీఆర్ కూడా వెళ్లక తప్పదన్నారు. కేసీఆర్, హరీశ్ రావులు కూడా తప్పు చేశారని అన్నారు.