తిరుమలలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. పలు ప్రాంతాలను పరిశీలించారు. దర్శనానికి విచ్చేసే విఐపిలకు వారికి అందించే పాసులలోనే దర్శన సమయం, పార్కింగ్ ప్రాంతం, ప్రవేశ, నిష్క్రమణ గేట్ల వివరాలు పొందిపరిచనున్నట్లు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు.