ఫార్ములా ఇ కారు రేసు కేసుకు సంబంధించి ఈడీ దూకుడు పెంచింది. ఎవరి ఆదేశాల మేరకు కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి బదిలీ చేశారో చెప్పాలంటూ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది. మరో వైపు కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ హైకోర్టును ఆశ్రయించింది. తాము ఆదేశాలు ఇచ్చేంత వరకు అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశించింది.