శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1,365 కోట్లు
NEWS Jan 02,2025 05:20 am
తిరుమల శ్రీవారి ఆలయానికి గణనీయమైన ఆదాయం సమకూరింది. 2024 ఏడాదికి సంబంధించి భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా రూ. 1,365 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. స్వామి వారిని 2.55 కోట్ల మంది దర్శించుకోగా, 90 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు తెలిపారు.