ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే దావోస్ సదస్సులో పాల్గొననున్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. అంతకు ముందు 15 నుంచి 19 వరకు నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి బృందం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. క్వీన్స్ లాండ్ స్పోర్ట్స్ యూనివర్శిటీని పరిశీలిస్తారు. 19,20 తేదీలలో సింగపూర్ లో పారిశ్రామికవేత్తలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం టూర్ ఉండనుంది.