సీఎం నారా చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. దేశంలోనే అత్యంత సంపన్నమైన సీఎంగా టాప్ లో నిలిచారు. మరో వైపు సంపదను సృష్టించే పనిలో పడ్డారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఆరు నూరైనా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఒక్క రోజులోనే ఆయన 2 వేల మందిని కలుసుకున్నారు. 1600 మందికి సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 పై ఫోకస్ పెట్టాలన్నారు.