రేషన్ బియ్యం స్కామ్ కేసుకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్బంగా తనకు చెందిన గో డౌన్ నుంచి 4 వేల టన్నుల రేషన్ బియ్యం మాయం కావడంపై ఆరా తీశారు. ఎవరికి పంపించారో చెప్పాలని అడిగారు. తనకు తెలియదంటూ సమాధానం ఇచ్చినట్లు సమాచారం.