ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నగర వాసులకు తీపి కబురు చెప్పారు. మెట్రో ప్రయాణీకుల ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శామీర్ పేట్, మేడ్చల్ వరకు మెట్రో మార్గాలను విస్తరించాలని నిర్ణయించారు. జేబీఎస్ నుండి శామీర్ పేట్ వరకు 22 కిలోమీటర్లు, ప్యారడైజ్ నుండి మేడ్చల్ దాకా 23 కీలోమీటర్ల వరకు మెట్రో రైలు మార్గానికి ఓకే చెప్పారు.