ఏపీ కూటమి సర్కార్ పేదల అభ్యున్నతి కోసం పాటు పడుతుందని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. పేదలకు లబ్ది చేకూర్చేలా సీఎంఆర్ఎఫ్ నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. దీని వల్ల 1,600 మందికి రూ. 24 కోట్ల మేర నిధులు అందుతాయని అన్నారు. ఇప్పటి వరకు రూ. 100 కోట్లకు పైగా నిధులను పేద వర్గాలకు మంజూరు చేశామని, 7,523 మందికి లబ్ది చేకూరిందన్నారు.