వైద్య సేవల్లో లోపాలను తొలగించాలి
NEWS Jan 01,2025 04:19 pm
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ వైద్య సేవల్లో లోపాలను తొలగించాలని పిలుపునిచ్చారు మంత్రి సత్య కుమార్ యాదవ్. సేవల నాణ్యతను మరింత మెరుగు పర్చేందుకు వైద్య సిబ్బంది పునరంకితం కావాలని అన్నారు. ఆరోగ్య, సౌభాగ్య, ఆనంద ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు ప్రజారోగ్యం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. నూతన సంవత్సరం సందర్బంగా బహిరంగ లేఖ రాశారు.