పేద విద్యార్థికి ఆర్థిక సాయం
NEWS Jan 01,2025 04:24 pm
ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన విద్యార్థి వెంకీ ప్రతిభ బీఎస్సీ నర్సింగ్‌లో సీటు సంపాదించింది. అయితే ఫీజు కట్టేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆ విద్యార్థికి మాజీ మున్సిపల్ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రజిత వెంకట్రామిరెడ్డి, మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబ, మాజీ జడ్పీటీసీ సామెల్, మాజీ సొసైటీ ఛైర్మన్ బోండ్ల సాయిలు, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.