పసుపు రైతుల చిరకాల కోరిక తీర బోతోందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఇందూరు కేంద్రంగానే ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. ఈ ఏడాదిలో బోర్డును ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నవోదయ పాఠశాలతో పాటు ఆర్‌వోబీల నిర్మాణం పూర్తి చేయిస్తానని చెప్పారు. .బోధన్, నిజామాబాద్‌లో 2 కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభించామని అన్నారు. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.