ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
NEWS Dec 31,2024 08:21 am
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు జనసేన పార్టీ నేత పీతల మూర్తి యాదవ్. అనేక పోరాటాల కారణంగానే అత్యధిక మెజారిటీని ప్రజలు కట్టబెట్టారన్నారు. 175 స్థానాలు సాధించడం మామూలు విషయం కాదన్నారు. వైసీపీ నేతల అక్రమాలు అడ్డు లేకుండా పోయిందని, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల సారథ్యంలో ఏపీ దూసుకు పోతోందన్నారు.