ఏపీలో పండుగలా పెన్షన్లు పంపిణీ
NEWS Dec 31,2024 07:24 am
ఏపీలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రూ. 2,717 కోట్లతో 63,77,943 మందికి ఫించన్లు అందజేశారు. కొత్త సంవత్సరం నేపథ్యంలో ఈనెల 31వ తేదీనే పంపిణీ చేపట్టారు. జనవరి 1కి ముందే పేదల ఇళ్లల్లో డబ్బులు ఉండాలనే ఉద్దేశంతో దీనిని చేపట్టామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.