రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డి
NEWS Dec 30,2024 05:52 pm
మెట్‌పల్లి పట్టణంలోని పోలీస్ స్టేషన్లో మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పరిధిలోని 30 మంది రౌడీ షీటర్లకు మెట్‌పల్లి సీఐ నిరంజన్ రెడ్డి కౌన్సెలింగ్ నిర్వహించారు. డిసెంబర్ 31న రాత్రి రోడ్లపై తిరిగి అల్లర్లు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా గొడవల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటే రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు.