నీలకంఠేశ్వరాలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు
NEWS Dec 30,2024 01:18 pm
ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నగరంలోని శ్రీ నీలకంఠేశ్వరాలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆమె వెంట మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గడ్డం సుమన, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కడారి శ్రీవాణిలు ఉన్నారు. ఆలయంలో పూజారులు నీలకంఠేశ్వరుడి గర్భగుడిలో ఆమె పేరున ప్రత్యేక అర్చనలు చేశారు. ఆలయంలోని అన్ని దేవుళ్లను ఆమె దర్శించుకుని ప్రదక్షిణలు చేశారు. పూజల అనంతరం కవితకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.