మేం కన్నెర్ర చేస్తే ఎవరూ మిగలరు
NEWS Dec 29,2024 01:37 pm
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము కన్నెర్ర చేస్తే వైసీపీ నేతలు ఎవరూ మిగలరని, చంద్రబాబు మంచితనం వల్లనే బతికి పోతున్నారని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ వారిని చిత్రహింసలకు గురి చేశారని, కేసులు నమోదు చేశారని ఆరోపించారు. పేర్ని నానికి ఇప్పుడు ఆడవాళ్లు గుర్తుకు వచ్చారా అని నిలదీశారు.