డా.మనీషాకు వెటర్నరీ డాక్టర్ల సన్మానం
NEWS Dec 29,2024 05:37 am
జగిత్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఇటీవల కిసాన్ సేవా రత్న జాతీయ పురస్కారం అందుకున్న డాక్టర్ మనీషా పటేల్ ని జిల్లా పశు వైద్య, పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ ఎస్ఎల్ మనోహర్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి.నరేష్, జిల్లాలో పని చేస్తున్న వెటర్నరీ డాక్టర్‌లు సన్మానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మనీషా మాట్లాడుతూ.. నిరంతరం సహకారం, ప్రోత్సాహం అందిస్తున్న జిల్లా అధికారులకు, తోటి అధికార్లకు, సిబ్బందికి కృతఙ్ఞతలు తెలిపారు.