50 రోజుల్లో రూ.55 లక్షలు విరాళం
NEWS Dec 28,2024 09:19 am
టీటీడీ అన్న ప్రసాదం కోసం ప్రారంభించిన కియోస్క్ మిషన్ల ఏర్పాటుతో 50 రోజుల్లో రూ. 55 లక్షలు విరాళంగా వచ్చాయని ఈవో తెలిపారు. ఈ మిషన్లను పద్మావతి అమ్మవారి ఆలయం, కోదండ రామాలయం, బెంగుళూరులో శ్రీవారి ఆలయంలో ప్రారంభించామన్నారు. పేరూరు సమీపంలోని శ్రీ వకుళామాత ఆలయంలో కియోస్క్ ను కొత్తగా ఏర్పాటు చేశామని, త్వరలో విజయవాడ, చెన్నై, హైదరాబాద్ లో ప్రారంభిస్తామన్నారు.