బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం
NEWS Dec 28,2024 07:52 am
కడప జిల్లా దిద్దేకుంట గ్రామంలో రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం పట్ల మంత్రి సవిత తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పొలం లోనే రైతు నాగేంద్ర, భార్య వాణి, కొడుకు భార్గవ్, కూతురు గాయత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైతు కుటుంబం ఆత్మహత్యపై జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఇన్చార్జి ఎస్పీ విద్యా సాగర్ నాయుడుతో ఫోన్లో మాట్లాడామన్నారు. రైతు కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.