రూ. 111 కోట్ల ఆదాయం..97 లక్షల లడ్డూలు పంపిణీ
NEWS Dec 28,2024 06:44 am
గత నవంబర్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 111 కోట్లు వచ్చినట్లు తెలిపారు టీటీడీ ఈవో శ్యామల రావు. 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, 97 లక్షల శ్రీవారి లడ్డూలు పంపిణీ చేశామన్నారు. 19.74 లక్షల మంది అన్న ప్రసాదాలు స్వీకరించారని, 7.31 లక్షల మంది తలనీలాలు సమర్పించారని పేర్కొన్నారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈ విషయాలను వెల్లడించారు.