వైకుంఠ ఏకాదశికి ఘనంగా ఏర్పాట్లు
NEWS Dec 28,2024 06:30 am
2025 జనవరి 10 నుండి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకుని ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఏఈవో వెంకయ్య చౌదరి. టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీవారి ప్రసాదాలను అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు.