మాజీ ప్రధానికి రఘువీరారెడ్డి నివాళి
NEWS Dec 28,2024 06:32 am
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి అన్నారు. ఢిల్లీలో మాజీ ప్రధాని కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలకు అందించిన సేవలను స్మరించుకున్నారు. దేశానికే గర్వకారణంగా మన్మోహన్ సింగ్ నిలిచారన్నారు.