ఎంపీడీఓపై దాడి పట్ల మంత్రి సీరియస్
NEWS Dec 28,2024 05:37 am
వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును ఫోన్ లో పరామర్శించారు మంత్రి వంగలపూడి అనిత. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యంలో చెల్లదన్నారు. వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు.