పొతంగల్ మండలంలోని మంజీర నది నుంచి ఇసుక అక్రమ రవాణ అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. అధికారులను ఇసుక మాఫియా భయబ్రాంతులకు గురి చేస్తోంది.కొన్ని నెలలుగా రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోందని ఫిర్యాదులు అందడంతో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో మంజీర పరీవాహక ప్రాంతంలో ఇటీవల పర్యటించారు. ఆయన ఆదేశాల మేరకు పది రోజుల క్రితం ఇసుక అక్రమ రవాణా కట్టడికి రెవెన్యూ, పోలీసులతో కలిసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బృందం ప్రతి రోజూ రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు పెట్రోలింగ్ చేస్తోంది.