ఇండ్ల సర్వే పక్కాగా నిర్వహించాలి
NEWS Dec 27,2024 11:59 am
ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ఎల్లారెడ్డి మండలం మీసాన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇండ్ల లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయడం జరుగుతుందని, ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇండ్లు మంజూరు చేయడానికి సర్వే చేపడుతున్నామని తెలిపారు. స్వంత భూమి ఉండి నిరూపేద లైన వారి వివరాలు సేకరించాలన్నారు.