మెప్మా ఆద్వర్యంలో అర్బన్ మార్కెట్
NEWS Dec 26,2024 06:48 pm
కొండపల్లి మెప్మా ఆధ్వర్యంలో స్థానిక బీ కాలనీ సెంటర్ లో గురువారం అర్బన్ మార్కెట్ ను ప్రారంభించారు. ఈ మార్కెట్ లో స్వయం సహాయక సంఘ సభ్యులు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేశారు. అర్బన్ మార్కెట్ కు విశేష స్పందన లభించింది. మార్కెట్ ను పట్టణ సమాఖ్య ప్రెసిడెంట్ సిహెచ్.వెంకటేశ్వరమ్మ పర్యవేక్షించారు. మెప్మా సీఎంఎం శ్రీధర్, సీవోలు వెంకట నరసమ్మ, వెంకయ్య, ఆర్పీలు పాల్గొన్నారు.