మాజీ మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి సర్కార్ పాలన గాడి తప్పిందన్నారు. దీంతో ప్రజలు ఆరు నెలలకే విసిగి పోయారని, తిరిగి సంక్షేమ పాలనను అందించిన జగన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఆరు గ్యారెంటీలు అని కాపీ కొట్టి ప్రజల నెత్తిన శఠగోపం పెట్టారంటూ సీఎం చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు ఆర్కే రోజా.